VSP: మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు విశాఖపట్నం తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. ఆదివారం వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మహిళల వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. వైజాగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.