KMM: నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆరు అవార్డులను గెలుచుకుంది. విద్యార్థుల నమోదు సంఖ్యలో ఆదర్శంగా నిలిచినందుకు ఈ పాఠశాలకు ఉత్తమ పాఠశాలగా అవార్డు లభించింది. పదోతరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించినందుకు జిల్లా స్థాయిలో, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించినందుకు అవార్డులు పొందారు.