NLR: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనని చంపితే డబ్బిస్తామన్నదెవరో తేలాలని, తనపై మర్డర్ ప్లాన్ ఎందుకు వేశారో తనకు కూడా తెలియదని అన్నారు. ఈ విషయాన్ని పోలీసులే తేల్చాలని పేర్కొన్నారు. తన అనుచరులే కుట్ర చేశారనడం సరికాదని, తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే కుట్రపన్నారు అని వెల్లడించారు.