కర్నూలులో సెప్టెంబర్ 4న గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేలా 2 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1200 విగ్రహాల నిమజ్జనానికి డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
నెల్లూరు: కావలి సీనియర్ జనసేన నేత సిద్దూ ‘కావలి భగత్ సింగ్’ అంటూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఓ కార్యక్రమంలో కితాబ్ ఇచ్చారు. సిద్దూకు ఆత్మవిశ్వాసం, పోరాట పటిమలు మెండుగా ఉన్నాయని ప్రశంసించారు. అలాగే ఫైర్, జాలి ఉన్నాయన్నారు. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే గొప్ప వ్యక్తని కొనియాడారు. చిన్న వయసులోనే ఎన్నో సేవా గుణాలు కలిగిన సిద్ధూ తనకెంతో ఇష్టమన్నారు.
కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వ్యక్తిగత పనులపై యూకేకు వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్‌కు కలెక్టరుగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ తిరిగి 18న విధులకు హజరుకానున్నారు.
W.G: పాలకోడేరు మండలం గరగపర్రులో బుధవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మణిరాజును ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఏడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
PPM: జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్. మన్మధరావు జిల్లాలో పారా వెటర్నరీ సిబ్బంది మరియు గోపాలమిత్రలతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లాలో ఉన్న అన్ని ట్యూషన్‌లోను లింగ నిర్ధారిత వీర్యం (SSS)ను అమలు పరచమని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లింగ నిర్ధారిత వీర్యం ధరనురూ.500 నుంచి రూ.150 వరకు తగ్గించమన్నారు.
VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 5న అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:45కు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో ద్వారా అరకు వ్యాలీ మండలం మాడగడ గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో నిర్వహించనున్న బలిపోరోబ్ ముగింపు ఉత్సవంలో పాల్గొనున్నారు. 3:30కు మాడగడ నుంచి తిరిగి పయణమై సాయంత్రం 5:30కు తిరిగి విశాఖ చేరుకుంటారు.
చిత్తూరు డీఐ రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వామివారికి మంగళహారతి సమర్పించారు. అనంతరం నిర్వహించిన స్వామి వారి లడ్డూ వేలం పాటలో ఎమ్మెల్యే లడ్డూను రూ.4 లక్షలకు కైవసం చేసుకుని భక్తులకు పంచిపెట్టారు.
TPT: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెంకటగిరి పోలీస్ స్టేషనన్‌ను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, స్టోరేజ్ ఫుటేజ్, క్రైమ్ చార్ట్, పాత కేసుల పురోగతి, రౌడీ షీటర్స్ పరిస్థితి పరిశీలించారు. కోర్టు అనుమతితో వాహనాలను డిస్పోజ్ చేయాలని, డ్రోన్ పర్యవేక్షణతో అసాంఘిక కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
నెల్లూరు: భూములు ఇవ్వం.. మా ఊరుని ఖాళీ చేయం.. అంటూ కరేడు రైతులు, గిరిజన కాలనీవాసులు బుధవారం మరోసారి స్పష్టం చేశారు. భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా వారంతా కావలిలోని అధికారిని కలిసి తమ అసమ్మతిని వ్రాతపూర్వకంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సీఐటీయు జిల్లా నాయకులు అజయ్ కుమార్, రైతు కూలీసంఘం నాయకులు సాగర్, తదితరులు పాల్గొన్నారు.
VZM: మున్సిపల్ కమీషనర్ నల్లనయ్య ఆదేశాలతో స్దానిక సీబీ కాలనీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవన నిర్మాణ పునాదులను బుధవారం ప్రణాళిక అధికారులు తొలగించారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి, టౌన్ వ్లానింగ్ అధికారి అప్పలరాజు, ప్రణాళిక సిబ్బంది JCBతో అక్కడికి చేరుకుని అనుమతులు లేకుండా నిర్మిస్తున్న దుకాణాలను తొలగించారు.
కోనసీమ: మామిడికుదురు మండలానికి చెందిన ఓ గ్రామంలో మానసిక దివ్యాంగురాలైన 15 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగుచూసింది. నిందితుడు జరిగిన నేరాన్ని బయటకు రానీయకుండా పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లలేదని తెలిసింది.
NTR: ప్రకృతి సేద్యంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ జీ. లక్ష్మిశ వ్యవసాయ అధికారులకు సూచించారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆదేశించారు. ఘన, ద్రవ జీవామృతం తయారీ, వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
W.G: జిల్లా రవాణా అధికారిగా కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల బస్సులకు ఫిట్నెస్ తనిఖీలు, రహదారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నెల్లూరు: టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. బుచ్చిరెడ్డిపాలెం(M) పెనుబల్లి MPPSలో SGTగా పనిచేస్తున్న CH చెన్నయ్య, ఇందుకూరుపేట MKR ప్రభుత్వ జూ. కాలేజ్ లెక్చరర్ డొమిని రెడ్డి, అదే మండలంలోని నరసాపురం ZP హైస్కూల్ పీడీ ముజీర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. విజయవాడలో వీళ్లు అవార్డులు అందుకుంటారు.
TPT: గుంటూరుకు చెందిన అలపాటి సురేష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,11,111 విరాళంగా అందించారు. భక్తుల సేవార్థం అన్నప్రసాదం కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ విరాళాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్యచౌదరి వారికి అందజేశారు.