VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో విరాళాలకు సంబంధించిన రసీదుల బుక్ ఒకటి మిస్సైంది. 2017 నుంచి ఇప్పటి వరకు ఆభరణాల లెక్కింపు జరగకపోవడంతో ఇటీవల విజయవాడ నుంచి వచ్చిన తనిఖీ బృందం అప్పటి నుంచి పనిచేస్తున్న వారిని విశాఖకు పిలిపించి లెక్కలు వేసింది. స్టోర్ రూమ్‌లో ఉన్న 8వెండి వస్తువుల వివరాలు మినహా మిగతా ఆభరణాల లెక్కలు సరిపోయాయని తెలిపింది.
GNTR: పెదనందిపాడు (M) వరగని ఏబీపాలెం వాగు వద్ద శనివారం ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పు బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
E.G: దేవరపల్లి ఎంపీపీ కేవీకే.దుర్గారావు శనివారం ఉదయం దేవరపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎంపీపీ నిధుల నుంచి దేవరపల్లిలో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి రూ.7 లక్షలతో ఈ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. అలాగే, మండల అభివృద్ధికి పలు ప్రణాళికలు రూపొందించామన్నారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని రేకలకుంట పంచాయతీ బాగాదీపల్లెలో వినాయక స్వామి ఊరేగింపు సందర్భంగా బాణసంచా పేలి గాయపడిన నలుగురిలో పాలకొండయ్య (35) శుక్రవారం మృతి చెందారు. గత నెల 29న జరిగిన ఈ ఘటనలో గాయపడిన పాలకొండయ్య కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలం పాత మసీదు వీధిలో నిలిపి ఉంచిన కారుకు శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితుడు అన్వర్ బాషా వాపోయారు. తన ఇంటి సమీపంలో ఉన్న వాహనంపై పెట్రోలు పోసి నిప్పు పెట్టడంతో కారు పూర్తిగా కాలిపోయిందని ఆయన తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వర్మ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మేధా గ్రూప్ కంపెనీ 300 అప్రెంటిస్ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ ఉత్తీర్ణులై ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన వారు సర్టిఫికెట్లతో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు.
BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలోని పాటిమీద బజార్ నందు వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం గ్రామానికి చెందిన డక్కా హనుమంతరావు ఉత్సవ కమిటీ సభ్యులు కోరిక మేరకు శివలింగాకార లడ్డు చేయించారు. లడ్డును భక్తిశ్రద్ధలతో చేయించినట్లు ఆయన చెప్పారు. శివలింగాకారంలో ఉన్న లడ్డు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అన్నమయ్య: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని వైసీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కామసాని చెన్నకేశవరెడ్డి విమర్శించారు.శుక్రవారం రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.గత 14 నెలల పాలనలో కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, ఎరువుల కొరత, పంట భీమా, నష్టపరిహారం, సబ్సిడీలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని తెలుగు సినీ దర్శకులు దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కోనసీమ: వినాయక నిమజ్జనం సమయంలో శుక్రవారం రాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్న హిజ్రాలను ఆత్రేయపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెలిచేరు గ్రామంలోని యూజీ పాలెంలో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అశ్లీల నృత్యాలు నిలిపివేశామన్నారు.
కోనసీమ: యానాం సుబ్రహ్మణ్యభారతి వీధిలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షుడు దినేష్ రామ్మూర్తి తెలిపారు. కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందంతో కంటి వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
SKLM: పలాస మండలం గరుడఖండిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఈ నేపథ్యంలో జరిగిన బొజ్జ గణపయ్య నిమజ్జన కార్యక్రమానికి రాష్ట్ర ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబురావు హాజరయ్యారు. వినాయకుడిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.
KDP: గువ్వలచెరువు ఘాట్ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి ఆయిల్ బయటికి వచ్చింది. ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా.. ఎంత నష్టం వాటిల్లింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ జగదీశ్, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేక బందోబస్తుతో తిమ్మంపల్లి నుంచి ఆయనను తాడిపత్రికి తీసుకువచ్చారు. నివాసానికి చేరుకోగానే గుమ్మడికాయతో హారతి ఇచ్చి దిష్టి తీశారు. దాదాపు 15 నెలల తర్వాత ఆయన తాడిపత్రికి తిరిగి వచ్చారు.
CTR: వెదురుకుప్పంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ప్రధాన రహదారిపై కొన్ని రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. నియోజకవర్గ వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ కోలారు వెంకట ప్రకాశ్ మిత్ర బృదంతో కలిసి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. దీనిని స్థానికులు వారిని అభినందించారు.