KKD: జిల్లాలో వంగవీటి రంగా విగ్రహ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌కు ఫోన్లో సూచించారు. అనుమతులు లేకుండా విగ్రహాలు పెట్టొద్దని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పవన్ ఆదేశించినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.