GNTR: తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలు జరుగునుంది. ఛైర్మన్ అభ్యర్థిగా కూటమి తరపున హరిప్రసాద్ పేరు ఖరారు అయింది. మొత్తం 11 డైరెక్టర్ స్థానాలకు టీడీపీ 6, జనసేన 4, బీజేపీ 1 స్థానానికి పోటీ చేయనున్నట్లు ఒప్పందం కుదిరింది. ఆదివారం ఉదయం టీడీపీ, జనసేన కార్యాలయాల నుంచి అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.