TG: వినాయక విగ్రహాల ఎత్తు పెరగడంతో శోభాయాత్ర ఆలస్యమైందని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ‘నిన్న ఉదయం 6:30కి గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. ఇంకా 900 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది. చిన్న విగ్రహాలు కలుపుకుని ఇవాళ 25 వేల విగ్రహాలు నిమజ్జనం అవ్వాలి. 40 గంటల పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగింది. 12,034 విగ్రహాలు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు’ అని వెల్లడించారు.