పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ మున్సిపాలిటీ కోతులకు ఆహారం పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కోతులకు ఆహారం పెడితే రూ.5 వేల జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ నిబంధన పర్యాటకులతో పాటు స్థానికులకు కూడా వర్తిస్తుంది. జనావాసాల్లో కోతుల బెడద, వాటి కాటు వల్ల రేబిస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు.