SRCL: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకలు సిరిసిల్ల మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద, ప్రేమ్ నగర్లో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు బోటులో మానేరు నదిలో నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. నిమజ్జన సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సూచించారు.