US ఓపెన్ టెన్నిస్ మహిళల విభాగంలో ఆదివారం ఉదయం ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో అమెరికా క్రీడాకారిణి అమందా అనిసిమోవాను బెలారస్ ప్లేయర్ సబలెంకా 6-3, 7-6 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. దశాబ్దం క్రితం సెరెనా విలియమ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా సబలెంక రికార్డు నెలకొల్పింది.