JGL: జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం జరిగే అంబేద్కర్ స్మరణ కార్యక్రమాన్ని నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఆవోపా అధ్యక్షుడు, ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ పాల్గొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాలు, అనాథలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.