MDK: చేగుంట మండల ఉపాధ్యాయురాలు బతుకూరి మంజులత ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నామినేట్ జరగా ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మంజులతను సన్మానించినట్లు క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు, డాక్టర్ లక్ష్మీనారాయణ, గవర్నర్ అమర్నాథ్ రావు తదితరులు ఉన్నారు.