BDK: ఏన్కూర్ వినోబానగర్ గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో ప్రజల తాగునీటి సమస్యను తీర్చేందుకు వైరా ఎమ్మెల్యే, మాలోతు రాందాస్ నాయక్, ప్రత్యేకంగా ఐదు లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో బోరుభావి నిర్మాణంతో పాటు పైప్ లైను నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈరోజు బోరు నిర్మాణం ఏర్పాటు కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.