PDPL: సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆదివారం శివపల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల గోడలు, సంఘాల భవనాల పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.