‘లిటిల్ హార్ట్స్’ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. దీనికి ప్రధాన కారణం.. మంచి కంటెంట్, తక్కువ టికెట్ ధరలు. దీంతో సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు వెళుతున్నారు. పెద్ద సినిమాల టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళడం తగ్గించారు. అందుకే పెద్ద చిత్రాలు కలెక్షన్స్ రాబట్టలేకపోతున్నాయి. చిన్న సినిమాలు తక్కువ టికెట్ ధరతో లాంగ్ రన్లో భారీ లాభాలను పొందుతున్నాయి.