MBNR: నమస్తే తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ బందిగే గోపి తండ్రి బందిగే మల్లప్ప పరమపదించిన సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఫొటో, వీడియో జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.