KDP: తొండూరు మండలం అగడూరులో జిల్లా కళాజాగృతి బృందం ఆధ్వర్యంలో ఆదివారం సైబర్ నేరాలు, ఫ్యాక్షన్ నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కళాజాగృతి బృందం నరసయ్య గ్రామస్తులకు సైబర్ నేరాల ప్రభావం, వాటిని ఎలా నివారించుకోవాలో చక్కగా వివరించారు. అదే విధంగా ఫ్యాక్షన్ వలన కలిగే నష్టాలు, అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుమారు 200 మంది పాల్గొన్నారు.