KMM: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనికి నిరసనగా నేడు ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని MRPS నాయకుడు కారుమంచి వెంకన్న తెలిపారు. గత ఎన్నికల్లో వికలాంగులకు రూ.6,000, వితంతువులకు రూ. 4,000 ఇస్తామని ప్రభుత్వం మోసపూరిత వాగ్దానం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమానికి MRPS నాయకులు రావాలని ఆయన పిలుపునిచ్చారు.