BHPL: మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో చల్లా దేవేందర్‌కు చెందిన ఆస్తి దగ్ధమైంది. పిండి గిర్ని, విద్యుత్ మోటార్లు, కుర్చీలు, రేకులు, గృహంలోని కలప పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు దేవేందర్ వాపోయారు.