TPT: శ్రీకాళహస్తి నగరి వీధిలోని ఒక స్వీట్స్ దుకాణంలో మిక్చర్ ప్యాకెట్లో సోమవారం బీడీ ముక్క దర్శనమిచ్చింది. దీంతో కొనుగోలుదారుడు నివ్వెర పోయాడు. సుమారు నెల రోజుల క్రితం శ్రీకాళహస్తిలో పెద్ద మసీదు వీధిలో ఓ టిఫిన్ దుకాణంలో బొద్దింక వచ్చింది. అప్పుడు అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేశారు. దీంతో ఇకనైనా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.