MBNR: భూత్పూర్(M) కప్పట గ్రామానికి చెందిన రేణుక(38) అనే వివాహిత అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. రేణుక విగతజీవిగా పడి ఉండడంతో అనుమానంతో ఆమె కుమార్తె శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భర్త వెంకటస్వామి ప్రతిరోజు మద్యం తాగి వస్తాడని, ఈ నేపథ్యంలో రాత్రి వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని కుమార్తె తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.