కామారెడ్డి నుంచి పోటీ చేసిన KCR ఇక్కడ వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను పరామర్శించకపోవడం సరికాదని TPCC ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కి గౌడ్ అన్నారు. KMR, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఆదివారం సాయంత్రం ఆయన వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు. రాజంపేట మండలం గుండారం, ఎల్లాపూర్, గుండారం, ఎల్లాపూర్ తండా, నడిమి తండాలో పర్యటించారు.