SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం పీఎం అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అన్ని ధ్రువ పత్రాలతో హాజరుకావాలన్నారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.