SKLM: జి.సిగడాం మండలం ముక్కుపేట గ్రామానికి చెందిన టి.వెంకటరావు (40) ఆదివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పంట పొలంలో విద్యుత్ నియంత్రిక మరమ్మతు పనులు చేస్తూ స్తంభం ఎక్కిన సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఎస్సై వై. మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.