ELR: ముసునూరు మండలం రమణక్కపేటలో గోడ బలంగా తగలడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన తోట మురళీకృష్ణ(34) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. పొలం పనులకు వెళ్లేందుకు హడావిడిగా బయలుదేరడంతో ప్రమాదవశాత్తు గోడ బలంగా తగిలింది. మురళీకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.