KRNL: ఆదోనిలో ఉద్యోగుల ఐక్యవేదిక కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి, వారి బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం విధులను బహిష్కరించింది. ‘మనమిత్ర-వాట్సాప్ ఈ-గవర్నెన్స్’ సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లే విధానం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని ఉద్యోగులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శాంతియుత నిరసనలు చేపట్టారు.