HNK: ఐనవోలు మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మూసివేసి వేశారు. సోమవారం ఉదయం అర్చకులు ఆలయానికి సంప్రోక్షణ నిర్వహించి, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం అందించనున్నారని ఆలయ ఈవో సుధాకర్, ఆలయ ఛైర్మన్ ప్రభాకర్ తెలిపారు.