ATP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొత్త జోనల్ ఇన్ఛార్జ్లను ప్రకటించారు. రాయలసీమ జోన్లోని చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఎన్.దయాకర్ రెడ్డిని నియమించారు. ఆయా జిల్లాల్లో పార్టీ బలోపేతం, నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయంపై దృష్టి సారించాలని మాధవ్ ఇన్ఛార్జ్లకు సూచించారు.