KRNL: వెల్దుర్తి మండలం నర్సాపురంలో ఆదివారం, ఎద్దుల బండి టైరుకు గాలి పట్టే క్రమంలో పేలిన టైరు ఇనుప రింగు తగిలి గాయపడిన మధు (22) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంక్చర్ షాపు నిర్వహిస్తున్న మధు, గ్రామ రైతు ఎద్దుల బండి టైరుకు గాలి పెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.