NLG: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈనెల 10 నుండి 17 వరకు మండల, పట్టణ కేంద్రాలలో ర్యాలీలు సభలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. ప్రజలు పాల్గొని వీటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోరాటాన్ని హిందూ,ముస్లిం పంచాయతీగా బీజేపీ చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు.