NLG: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఈ నెల 10న చిట్యాల పట్టణంలో నిర్వహించనున్నట్లు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐతరాజు యాదయ్య తెలిపారు. మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని కూడలిలో గల మహనీయుల విగ్రహాల వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, బీసీ నేతలు, రజక సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.