KNR: హుజూరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన మండల స్థాయి క్రీడోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.శోభారాణి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ గందె రాధిక, విడపు శ్రీనివాస్, పాల్గొన్నారు.