NLR: ఉదయగిరి రైతు సేవా కేంద్రంలో సోమవారం నుంచి రైతులకు యూరియా అందజేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి విజయభాస్కర్ తెలిపారు. ఉదయగిరి రైతు సేవా కేంద్రం-1కి 18 టన్నులు(400) బస్తాలు యూరియా వచ్చిందన్నారు. కావలసిన రైతులు ఆధార్ కార్డు పట్టాదారు పాసుపుస్తకంతో రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.