కృష్ణా: జిల్లాలో రైతులకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పామర్రు, గూడూరు మండలాల పర్యటన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ డీకే.బాలాజీ, అధికారులుతో సమావేశమై యూరియా స్థితిగతులపై సమీక్షించారు. అవసరమున్న రైతులకు ప్రాధాన్యతగా యూరియా సరఫరా చేయాలని ఆయన సూచించారు.