BPT: వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త కాలువ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై జనార్దన్ మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.