W.G: విద్యారంగం, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపై ఈ నెల 15 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘రణభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. భీమవరంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్సీ గోపి మూర్తితో కలిసి ‘రణభేరి’ పోస్టర్ను ఆవిష్కరించారు.