విశాఖలో దారుణఘటన జరిగింది. మూగ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సీపీ శంఖబ్రత బాగ్చీ వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మధార పరిసర ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.