NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధికారలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అగ్రికల్చర్ ఏవోలు, ఏఈవోలు, సీఈవోలు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతీ రైతుకు , ప్రతీ ఎకరాకు యూరియా అందేవిధంగా ప్రతిఒక్కరం కృషి చేయాలని పేర్కొన్నారు.