GDWL: కేటి దొడ్డి మండలం పాగుంట గ్రామంలో రజకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పెత్తందారులపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం (TRVS) రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన రజకులను ఆయన పరామర్శించారు. అనంతరం డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు.