VSP: విశాఖలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి అనిత ఆదివారం స్పందించారు. ఈ ఘటనపై ఆమె అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందని ఆమె తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హోం మంత్రి పేర్కొన్నారు.