NLG: సీపీఎం సీనియర్ నాయకుడు, కామ్రేడ్ కంచర్ల కోటిరెడ్డి నాలుగో వర్ధంతిని మిర్యాలగూడ మండలం చిల్లాపురంలో నిర్వహించారు .జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరెల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రవి నాయక్, జిల్లా కమిటీ సభ్యులు చౌగోని సీతారాములు తదితరులు పాల్గొన్నారు.