CTR: నగిరి మండలం అనంతపు నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు విజయేంద్ర ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా వారి ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. అనంతరం ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ పరామర్శలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.