CTR: వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ రామకృష్ణాపురంలో రైతుకు చెందిన 35 మామిడి చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికి వేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రైతు మాధవరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చెట్లు నరికి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వం తరఫున తనకు న్యాయం చేయాలని కోరారు.