NLG:సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర రెడ్డి సంస్మరణ సభ ఈనెల 10న నిర్వహించనున్నారు. నల్లగొండలోని దేవరకొండ రోడ్లో గల జీఎల్ గార్డెన్లో నిర్వహించడం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. ఇవాళ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ సంస్మర సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు.