PDPL: సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షులు యాదగిరి సత్తయ్య విజ్ఞప్తి చేశారు. గోదావరిఖనిలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి విస్తరించున్న ఆరు జిల్లాలకు భౌగోళికంగా వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.