ELR: కైకలూరులో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనాల ఊరేగింపు కొనసాగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో కైకలూరు టౌన్లో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనంలో బండి హారన్ కొట్టడంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దానగూడెంకి చెందిన 7గురు గాయాలపాలయ్యారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు.