TG: కామారెడ్డిలోని జంగంపల్లి జ్యోతిరావుపూలే పాఠశాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.