PDPL: మంథని పట్టణం గుండా ప్రవహించే బొక్కల వాగుపై ఉన్న చెక్ డ్యాం ప్రస్తుత వర్షాలకు జలకళను సంతరించుకుంది. గతంలో వాగులో వచ్చిన నీరు వృథాగా గోదావరిలో కలిసేవి. ఇప్పుడు చెక్ డ్యాం నిర్మించడంతో నీరు నిల్వ ఉండి, భూగర్భజలాలు పెరిగాయి. దీంతో పంటల సాగుకు మేలు జరుగుతుందని దిగువ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.