కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం సాయంత్రం 22,160 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి 27,352 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి వదులుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 17.802 TMCలు కాగా ప్రస్తుతం 17.687 TMCలకు చేరుకుంది.